Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. అందుకే బీజేపీలో చేరాను : నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోదీతో చెప్పించుకునేలా పని చేస్తానని ఎంపీ రాములు స్పష్టం చేశారు.

Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. అందుకే బీజేపీలో చేరాను : నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు

Nagarkurnool MP Ramulu Joins BJP

Nagarkurnool MP Ramulu : తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగుతున్నాయి. మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను వీడిన ఆయన గురువారం (ఫిబ్రవరి 29) ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువ కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కుమారుడు భర‌త్‌తో పాటు ఎంపీ రాములు కమలం పార్టీలో చేరారు.

Read Also : Sharat Prathipati Arrest : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్

అయితే, చాలామంది బీజేపీలోకి చేరందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీలో చేరిన సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మోడీ మెచ్చేలా పనిచేస్తా : రాములు
ఈ సందర్భంగా ఎంపీ రాములు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశానికి సేవ చేయాలనే భరత్ ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారని ఎంపీ రాములు చెప్పారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు.  నియోజకవర్గ అభివృద్ధి చెందలనే ఉద్దేశ్యంతోనే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఏ పార్టీలో ఉన్నా ప్రజా సేవ, అభివృద్ధి చేయడమే ముఖ్యమన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరాను తప్పా ఎవరిని విమర్శించడానికి కాదన్నారు. మోదీ నాయకత్వ పాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ‘తక్కువ మాట్లాడుతా.. ఎక్కువ పనిచేస్తా.. బీజేపీ కోసం పనిచేస్తా.. బాగా పనిచేస్తా అని మోడీతో చెప్పించుకునేలా పని చేస్తాను‘ అని ఎంపీ రాములు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ.. రాములు చేరిక బీజేపీకే బలం : కె. లక్ష్మణ్
బీజేపీలో సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన సందర్భంగా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాములు చేరికను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మచ్చలేని దళిత నాయకుడు రాములు అన్న లక్ష్మణ్.. జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నా భరత్‌ను చైర్మన్ కాకుండా బీఆర్ఎస్ చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోందన్నారు. తెలంగాణలో మోడీమయం ఉందని, మూడోసారి కూడా మోదీని ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కె.లక్ష్మణ్ చెప్పారు.

తెలంగాణ లో బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని, ఇప్పుడా పార్టీ మునిగిపోయిన పడవ గా ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. పార్టీలో రాములు చేరడం బీజేపీకి మరింత బలమన్నారు. 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి చాలా సహకారం అందించిందని ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలు కమంలో పార్టీలో చేరుతున్నారని, తెలంగాణలో 17 స్థానాలు బీజేపీ వైపు చూస్తున్నాయని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు.

Read Also : KTR : దమ్ముంటే రా.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్