KP Chaudhary Drug Csae : కేపీ చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో టాలీవుడ్ సెలబ్రెటీలు.. రిమాండ్ రిపోర్ట్ లో సినీ తారల పేర్లు
కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెలుగుచూడటం చర్చనీయాంశం అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న కేపీ చౌదరి వారి పేర్లను వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలయ్యింది.

KP Chaudhary Drug Csae
Tollywood Celebrities : కేపీ చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో టాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు బయటపడుతున్నాయి. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలైంది. కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని సెలబ్రిటీలు అంటున్నారు. మరోవైపు శనివారంతో కేపీ చౌదరి కస్టడీ ముగిసింది.
కేపీ చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కేపీ చౌదరిని మళ్లీ విచారిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందంటున్నారు. కేపీ చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోసారి సినీ సెలబ్రిటీల లిస్ట్ ను బయటపెట్టారు.
Bandla Ganesh : మళ్ళీ కాంగ్రెస్‌లోకే బండ్ల గణేష్.. భట్టి విక్రమార్క పాదయాత్రలో బండ్లన్న..
కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో మరికొంత మంది సినీ తారల పేర్లు వెలుగుచూడటం చర్చనీయాంశం అయ్యింది. పోలీసు కస్టడీలో ఉన్న కేపీ చౌదరి వారి పేర్లను వెల్లడించడంతో పలువురు సెలబ్రిటీలలో ఆందోళన మొదలయ్యింది. అయితే, కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని సెలబ్రిటీలు వాదిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చాలా మంది సినీ తారలను వెంటాడుతున్న నేపథ్యంలో కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం కూడా దుమారం రేపుతుందని తెలుస్తోంది.