Nampally Court : డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్.. బిజినెస్ మేన్ ల పోలీస్ కస్టడీకి నో చెప్పిన కోర్టు
ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, నిందితులైన వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ ను మాత్రం కోర్టు తిరస్కరించింది.

Drugs (2)
drugs case police custody of businessmen : డ్రగ్స్ కేసు లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. బిజినెస్ మేన్ ల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించలేదు. దీంతో బిజినెస్ మేన్ ల కస్టడీ కోసం సిటీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. బిజినెస్ మేన్ లను పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు. బిజినెస్ మేన్ కస్టడీ కోసం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఐదు రోజులు పాటు టోనీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించారు.
ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, నిందితులైన వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ ను మాత్రం కోర్టు తిరస్కరించింది. టోనీతో పాటు వ్యాపారులను కూడా విచారిస్తే విలువైన సమాచారం రాబట్టవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నేడు డ్రగ్స్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు.
Mahesh Bank Hacking Case : మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. కీలక అనుమానితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కాన్ఫరెన్స్ లో మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొని.. కార్యాచరణ, విధి విధానాలపై సదస్సులో చర్చించనున్నారు. డ్రగ్స్ అనే మాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. నార్కోటెక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం ఆదేశించారు.