Konda Surekha : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు

తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Konda Surekha : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు

Konda Surekha (Photo Credit : Google)

Updated On : November 29, 2024 / 1:52 AM IST

Konda Surekha : సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో నాగార్జున వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ పై కేసు నమోదు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 12కి వాయిదా వేసింది కోర్టు.

తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మంత్రి కొండా సురేఖ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించారు. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన నోటితో చెప్పలేని మాటలు అన్నారని కోర్టుకు విన్నవించారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిందని తెలిపారు. నాగార్జున పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు.. 356 బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Also Read : తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ క్లాస్..! కారణం అదేనా?