నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్ చల్, మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షలు, 20 తులాల బంగారం చోరి

  • Published By: madhu ,Published On : October 20, 2020 / 08:38 AM IST
నగరంలో నేపాలీ గ్యాంగ్ హల్ చల్, మత్తు మందు ఇచ్చి రూ. 10 లక్షలు, 20 తులాల బంగారం చోరి

Updated On : October 20, 2020 / 10:32 AM IST

Nepali gang Hulchul In Hyderabad : నగరంలో నేపాలీ గ్యాంగ్ లు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట చోరీలకు పాల్పడుతూ..భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసిన ఈ ముఠాలు..శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సంపన్నుల కుటుంబాల్లో చేరి నమ్మకంగా వ్యవహరిస్తూ..అనంతరం భారీగా చోరీలకు పాల్పడుతున్నారు.



ఇటీవలే అక్టోబర్ 6న రాయదుర్గంలో ఇంటి కుటుంబసభ్యులందరికీ డిన్నర్ లో మత్తుమందు కలిపి నగదు, నగలతో నేపాలీ గ్యాంగ్ పరారైంది. మొత్తం రూ. 40 లక్షలతో పారిపోయిన వీరిని యూపీ బోర్డర్ లో పట్టుకున్న ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
https://10tv.in/what-is-the-target-of-dangerous-kanjarbhat-gang/
మేడ్చల్, నాచారం పీఎస్ పరిధి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం..శుభకార్యానికి వెళ్లింది. ఆ సమయంలో వృద్ధురాలు ఉంది. వీరింట్లో పని చేసిన నేపాలీ వ్యక్తులు..ఆమెకు మత్తు మందు ఇచ్చి..రూ.10 లక్షలు, 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. 10 రోజుల క్రితమే వీరింట్లో పనిమనుషులుగా చేరారు.



సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. నగరంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి చోరీ జరగడం చర్చనీయాంశమైంది.



హడావుడిగా రాత్రుళ్లు కన్నాలేసి ఏం సాధిస్తామనుకున్నారో ఏమో కానీ..దోచుకుంటే పక్కా ప్రణాళికతో భారీగా ఉండాలనుకుంటున్నారు ఈ నేపాలీ గ్యాంగ్ లు. అసలు ఎన్ని గ్యాంగ్ లు తిష్ట వేశాయో తెలియడం లేదు. సంపన్నుల కుటుంబంలో పనికి కుదిరి.. నమ్మకస్థుడిగా మెలుగుతారు. మరికొందరిని పనికి కుదిర్చి.. ‘ఓ మంచి పనోళ్లు..’ అని ఇంటిల్లిపాదితో అనిపించుకుంటారు. పూర్తిగా నమ్మారని అనిపించిన అదుపు చూసి అసలు పని మొదలుపెడుతారు.