Omicron : హయత్‌నగర్‌లో ఒమిక్రాన్ కలకలం
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.

Omicron (2)
Omicron : తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ యువకుడు తాజాగా సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఇక తాజాగా నమోదైన కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఈ యువకుడి కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులుండగా ఆ తర్వాత ఢిల్లీలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.
చదవండి : Omicron In Telangana : తెలంగాణలో 20కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా మరో 12 గుర్తింపు