New strain corona in Telangana : నోరు మెదపవద్దని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు !

New strain corona in Telangana : తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కంగారు పుట్టిస్తున్నాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసిలో కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అతని నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. యూకే నుంచి తెలంగాణ వచ్చిన వాళ్లలో 20 మందికి ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కొత్త స్ట్రెయిన్‌పై ఎవరూ నోరు మెదపవద్దని వైద్య అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో వాళ్లెవరూ దీనిపై మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు.
మరోవైపు.. వివిధ రాష్ట్రాల నుంచి కొత్త స్ట్రెయిన్‌పై కేంద్రం నివేదికలు తెప్పించుకుంటోంది. 2020, డిసెంబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ పెట్టి కరోనా కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వెల్లడించే అవకాశం ఉంది. అయితే.. కొత్త స్ట్రెయిన్ వచ్చినా.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటోంది వైద్యశాఖ.
గత కొన్ని నెలలుగా కరోనా భయ కంపితులను సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో..బ్రిటన్ దేశంలో కొత్త కరోనా స్ట్రైయిన్ కేసులు వెలుగు చూడడం, ప్రపంచమంతా పాకడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ దేశం నుంచి వచ్చిన వారిని విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలాగే..బ్రిటన్ దేశం నుంచి..తెలంగాణ రాష్ట్రానికి కొంతమంది వచ్చారనే వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. తప్పనిసరిగా తమకు సమాచారం అందించాలని, హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అంశాలు వెల్లడిస్తుందో చూడాలి.