తెలంగాణతో పాటు దేశంలో ఇది అతి పెద్ద సమస్యగా మారింది: కొత్త డీజీపీ శివధర్‌ రెడ్డి

"పోలీసులకు ప్రతిపక్షము, అధికారపక్షము అని ఏమీ ఉండదు.. అంతా ఒకటే" అని తెలిపారు.

తెలంగాణతో పాటు దేశంలో ఇది అతి పెద్ద సమస్యగా మారింది: కొత్త డీజీపీ శివధర్‌ రెడ్డి

Shivadhar Reddy

Updated On : September 27, 2025 / 3:56 PM IST

Shivadhar Reddy: తెలంగాణ డీజీపీగా తనను ప్రభుత్వం నియమించడం పట్ల శివధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇవాళ 10టీవీతో శివధర్ రెడ్డి మాట్లాడుతూ… “నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను. ఇంటెలిజెన్స్ లో ఎస్పీ స్థాయి నుంచి డీజీ స్థాయి దాకా పనిచేశాను కాబట్టి రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉంది.

డ్రగ్స్ పై ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. ఈగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తోంది. డ్రగ్స్ ఒక మహమ్మారి లాగా మారింది. ఒక్క పోలీసు శాఖతో దీన్ని నిర్మూలన జరగదు.. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం కావాలి. (Shivadhar Reddy)

ప్రజల సహకారం తీసుకుని డ్రగ్స్‌ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటాము. సైబర్ క్రైమ్ సెక్యూరిటీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సైబర్ క్రైమ్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ సమస్య దేశం మొత్తం పెద్ద సమస్యగా మారింది.

Also Read: Viral Video: ఇది భారత్‌ కాదు.. పాకిస్థాన్‌లో నవరాత్రి సంబరాలు ఏ రేంజ్‌లో జరుపుకున్నారో చూడండి..

మన దగ్గర ఉన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో నేరాలను చాలావరకు అరికడుతున్నాం. ములుగు సహా తెలంగాణలోని ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మావోయిజం చాలా దెబ్బతినిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిజాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

చాలామంది మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి నక్సలిజంలో ఉన్న పెద్ద నాయకులు 30 మంది లొంగిపోయారు. ఇంకా 70 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే లొంగిపోయే విధంగా చర్యలు తీసుకుంటాం. పోలీసులకు ప్రతిపక్షము, అధికారపక్షము అని ఏమీ ఉండదు.. అంతా ఒకటే” అని తెలిపారు.