Palwancha Ramakrishna : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. తల్లి, సోదరి అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Vanama Raghavendra Rao
Palwancha Ramakrishna : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్నారు.
Price Hike: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతోన్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ రేట్లు
తన కుటుంబం ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర కారణం అని రామకృష్ణ ఆరోపించారు. అయితే, రామకృష్ణ తల్లి, సోదరి వెర్షన్ మరోలా ఉంది. వనమా రాఘవేంద్ర చాలా మంచోడని వారు సర్టిఫికెట్ ఇచ్చారు. రామకృష్ణ మంచోడని కాదని చెప్పారు. అసలు ఈ కేసులో వనమా రాఘవకు ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణ తల్లి, సోదరి చెప్పారు.
వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా వారిద్దరూ చెప్పారు. ఎవరో కావాలనే రాఘవేంద్రను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు రామకృష్ణ బలాదూర్ గా తిరిగేవాడని, ఇప్పటికే చాలా అప్పులు చేశాడని అతడి తల్లి చెప్పింది. ఆస్తి విషయమై మాట్లాడేందుకే రామకృష్ణను వనమా రాఘవేంద్ర దగ్గరికి తీసుకెళ్లానని సత్యవతి చెబుతోంది. అసలు ఈ విషయంలో తనను రామకృష్ణ ఎందుకు ఇరికించాడో తెలియదని సోదరి మాధవి అంది. వనమా రాఘవేంద్రతో తమ కుటుంబానికి ఎలాంటి గొడవలు లేవన్నారు.
Curry Bananas : కూర అరటిలో ఫైబర్ అధికం…బరువు తగ్గటం ఖాయం
భదాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ తన భార్య, పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వనమా రాఘవేంద్ర వేధింపుల కారణంగానే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటులోనూ, సెల్ఫీ వీడియోలోనూ ప్రధానంగా ఆరోపించాడు రామకృష్ణ. ఈ కేసులో వనమా రాఘవేంద్ర ఏ-2గా ఉన్నారు. ఏ-3గా తల్లి సూర్యావతి, ఏ-4గా సోదరి మాధవి ఉన్నారు. వనమా రాఘవేంద్ర 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
వనమా రాఘవేంద్రతో పాటు తన తల్లి, సోదరి కూడా వెన్నుపోటుకు పాల్పడ్డారని రామకృష్ణ తన సూసైడ్ నోటులో తెలిపారు. తన తల్లి తనకు డబ్బులు ఇవ్వకపోగా పెద్ద మనిషి పేరుతో వనమా రాఘవేంద్ర దగ్గరికి తీసుకెళ్లి వేధింపులకు పాల్పడిందని, తన భార్యను పంపాలని వనమా రాఘవేంద్ర కోరడంతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో రామకృష్ణ స్పష్టంగా తెలిపాడు.
ఈ నెల 3న పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రామకృష్ణ దంపతులు, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. భార్య, కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన రామకృష్ణ, తను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య లక్ష్మి, పెద్ద కూతురు సాహిత్య స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా చిన్నకూతురు సాహితి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
తొలుత గ్యాస్ సిలిండర్ ప్రమాదంగా అంతా భావించారు. రామకృష్ణ సూసైడ్ నోట్ బయటపడడంతో ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ, తన అక్క మాధవి, తల్లి సూర్యవతి కారణంగా తనకు అన్యాయం జరిగిందని.. అందుకే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రామకృష్ణ రాసి ఉండడం కలకలం రేపింది. తన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తల్లి-సోదరి-వనమా రాఘవేంద్ర వేధింపులు కారణం అని, తన భార్యను కూడా వనమా రాఘవ ఆశించాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ తెలిపాడు.