Secunderabad MMTS Incident: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల తీరుపట్ల బాధితురాలి ఆవేదన
గాయాలతో ఉన్న తనను స్థానికులు యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పింది.

Secunderabad MMTS Incident: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని, కట్టు కథ అల్లిందని, ఇన్ స్టా రీల్స్ చేసే క్రమంలో రైలు నుంచి జారి పడిపోయిందని పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, బాధితురాలి వర్షన్ మాత్రం మరోలా ఉంది.
రీల్స్ చేస్తూ రైలు నుంచి కింద పడిందని రైల్వే పోలీసులు కేసును క్లోస్ చేయడం పట్ల బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎటువంటి రీల్స్ తీయలేదని చెబుతోంది. తనపై అత్యాచారయత్నం జరిగిందని వాపోయింది. పోలీసులు దర్యాప్తు చేయకుండా కేసు కొట్టివేయడం అన్యాయం అంటోంది బాధితురాలు. తాను స్విగ్గీలో పని చేస్తున్నానని, మొబైల్ రిపేర్ ఉంటే మేడ్చల్ నుండి సికింద్రాబాద్ కు ట్రైన్ లో వెళ్లే సమయంలో కొందరు యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఏం చేయాలో తెలియక ట్రైన్ నుండి దూకేసిట్లు బాధితురాలు పేర్కొంది.
Also Read : MMTS లో అత్యాచారయత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్..
గాయాలతో ఉన్న తనను స్థానికులు యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పింది. పోలీసులు చెబుతున్నట్లుగా తాను ఎటువంటి రీల్స్ తీయలేదంది. పోలీసులు దర్యాప్తు చేయకుండా కేసు కొట్టివేయడం అన్యాయం అంటోంది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని బాధితురాలు స్పష్టం చేసింది.
మార్చ్ 22న సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. యువతి కట్టు కథ అల్లిందని, అత్యాచారయత్నం అంతా డ్రామా, రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయిందని పోలీసులు తేల్చారు. అంతేకాదు కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతలోనే బాధితురాలు మరో వెర్షన్ వినిపిస్తోంది. పోలీసులు చెప్పే దాంట్లో నిజం లేదంటోంది. తాను రీల్స్ చేయలేదంటోంది. కొందరు వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెబుతోంది. పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, బాధితురాలి వాదన మరోలా ఉంది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here