newborn baby In box : రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా అట్టపెట్టెలో పసిబిడ్డ..

newborn baby In box :  రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా అట్టపెట్టెలో పసిబిడ్డ..

Newborn Baby Boy Dead Body Found In Cardboard Bo

newborn baby boy dead body found In Cardboard box : అమ్మ కడుపులోంచి బైటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైనా చూడనేలేదు. అమ్మ పేగు తెంచుకుని పుట్టినప్పుడు అయిన రక్తపు చారికలు ఇంకా ఆరనేలేదు. అప్పుడే నూరేళ్లు నిండిపోయాపసిగుడ్డుకు. కన్నతల్లి పుట్టిన బిడ్డ భారమనుకుందో ఏమో తెలీదు..నవ మాసాలు మోసి కన్నతల్లి పేగు బంధం బరువనుకుందోమో..అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు నూరేళ్లూ నిండిపోయాయి. లేక నిండేలా చేశారో తెలీదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఓ అట్టపెట్టెలో పెట్టి ఏదో చెత్తను పారేసినట్లుగా రోడ్డు పక్కనే పారేసిన పాశవిక ఘటన హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్ ప్రాంతంలో టుచేసుకుంది..

పశువులు..క్రూర జంతువులు కూడా తమకు పుట్టిన బిడ్డనుతమ ప్రాణాలు అడ్డం వేసి కాపాడుకుంటాయి. కానీ అప్పుడే పుట్టిన పసిగుడ్డును ఓ వస్త్రంలో చుట్టి అట్టపెట్టెలో పెట్టి రోడ్డు పక్కన పారేశిన ఘటన బాలాపూర్ డీఆర్‌డీఎల్ శివాజీ చౌక్ వద్ద చోటుచేసుకుంది. బాలాపూర్ డీఆర్‌డీఎల్ శివాజీ చౌక్ వద్ద ఓ అట్టె పెట్టిను చూసి కుక్కలు దాని చుట్టూ తిరుగుతూ అరుస్తుంటే స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు.కానీ కుక్కలు పదే పదే ఆ అట్టె పెట్టెను వదలకుండా దాని చుట్టూ తిరుగుతూ మొరుగుతుంటే అనుమానం వచ్చింది.వెంటనే దాని దగ్గరకు వెళ్లారు.

కానీ బాంబు ఉందేమోననే భయం ఓ పక్కా..ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మరో పక్కా..అలా ఏది ఏమైనా అనుకుని అట్టపెట్టె దగ్గరకెళ్లి తెరిచి చూడగా దాంట్లో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృతదేహం ఉంది. దాన్ని చూసి షాక్ అయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అట్టపెట్టెలో అప్పుడే పుట్టిన మగ శిశువును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా శిశువు వస్త్రంలో చుట్టి కనిపించింది. వైద్యులతో పరీక్ష చేయించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అట్టపెట్టెను పరిశీలించారు. శిశువును చనిపోయాడక ఇక్కడ వదిలారా? లేక ఇక్కడ పడేశాక మృతి చెందాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలన ద్వారా శిశువును ఎవరు వదిలేశారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు.