Wedding: తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
శుక్రవారం పెళ్లి పీఠలు ఎక్కాల్సిన వరుడు.. ఒకరోజు ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Wedding (2)
Wedding: శుక్రవారం పెళ్లి పీఠలు ఎక్కాల్సిన వరుడు.. ఒకరోజు ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ (24) కు శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులంతా పెళ్లిపనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.. ఇంతలోనే గురువారం శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పెళ్లి కుమారుడు మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.