Pushpa-2: సంధ్య థియేటర్ ఘటనపై ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మానవహక్కుల సంఘానికి పిటిషనర్ ఫిర్యాదు చేశారు..

Sandhya Theater incident
Sandhya Theatre Incident: పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు పిటిషనర్. సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి అనుమతి లేకుండానే బెనిఫిట్ షో ఏర్పాటు చేశారని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ మానవహక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది.
Also Read: KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ కీలక సూచన.. నువ్వు అలాచేస్తే తప్పకుండా గౌరవిస్తాం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, పుష్ప-2 బెనిఫిట్ షోను బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేట్ లో ప్రదర్శించారు. సంధ్య థియేటర్ వద్దకు సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే థియేటర్ లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. అభిమానులు అల్లు అర్జున్ ను చూసేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేవతి (35) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కిందపోయారు. తొక్కిసలాటలో రేవంతి మరణించగా.. శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.