Nizamabad Hospital : స్ట్రెచర్ లేక రోగిని ఈడ్చుకెళ్లిన బంధువులు.. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ క్లారిటీ

Nizamabad Hospital: 15రోజుల కిందట సంఘటన జరిగితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ వాపోయారు.

Nizamabad Hospital : స్ట్రెచర్ లేక రోగిని ఈడ్చుకెళ్లిన బంధువులు.. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ క్లారిటీ

Nizamabad Hospital (Photo : Google)

Updated On : April 15, 2023 / 5:02 PM IST

Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఘటన దుమారం రేపింది. స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని అతడి బంధువులు ఈడ్చుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి హరీశ్ రావు సైతం సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడంతో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పందించారు. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు.

పేషెంట్ ను లాక్కుని వెళ్తున్న వీడియో వైరల్ అవుతున్న ఘటన చాలా బాధాకరం అన్నారు. 31న ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మద్యం తీసుకుని ఉన్నట్టు గుర్తించామన్నారు. సైకియాట్రిస్ట్ కలవాలని చెప్పామన్నారు. క్యాజువాలిటీ నుంచి వెయిటింగ్ హాల్ ఏరియాలో పేషెంట్ ను కేర్ బాయ్ కూర్చోబెట్టాడని వెల్లడించారు.

Also Read..Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో దారుణం.. స్ట్రెచర్ లేక రోగిని కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లిన బంధువులు

31న ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మద్యం తీసుకుని ఉన్నట్టు గుర్తించామన్నారు. సైకియాట్రిస్ట్ కలవాలని చెప్పామన్నారు. క్యాజువాలిటీ నుంచి వెయిటింగ్ హాల్ ఏరియాలో పేషెంట్ ను కేర్ బాయ్ కూర్చోబెట్టాడని వెల్డించారు.

అయితే, పేషంట్ కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లింది ఆసుపత్రి సిబ్బంది మాత్రం కాదని సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ క్లారిటీ ఇచ్చారు. హాస్పిటల్ లో వీల్ చైర్, స్ట్రెచర్స్ కొరత లేదని తేల్చి చెప్పారు. అన్నీ అందుబాటులో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఒక్కో విభాగానికి సంబంధించి వీల్ ఛైర్స్, స్ట్రెచర్స్ ఆయా రంగుల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

15రోజుల కిందట సంఘటన జరిగితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ వాపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు తీయడం జరిగిందన్నారు. ఆ పేషెంట్ ను బోధన్ అచనుపల్లి వాసి హనుమాండ్లుగా గుర్తించారు. వీడియో వైరల్ చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ తెలిపారు.

Also Read..Nizamabad Hospital Incident: నిజామాబాద్ ఘటనపై మంత్రి హరీష్‌రావు సీరియస్.. స్పందించిన షర్మిల, డీకే అరుణ .. దుష్ప్రచారమన్న సూపరింటెండెంట్

10 సెకన్ల వీడియో మాత్రమే కావాలని వైరల్ చేశారు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సేవలు కల్పిస్తున్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ చెప్పారు.

ఈ వ్యవహారం పొలిటికల్ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేశాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దారుణం! ఇదేనా కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇదేనా దేశానికి ఆదర్శమైన మోడల్? అని ప్రశ్నించారాయన. నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు లేక రోగిని ఇలా ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ కాదా!? అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. ఇది.. బీఆర్ఎస్ సర్కారు అరాచక పాలన ఫలితం అంటూ ట్వీట్ చేశారు.