Secunderabad Cantonment By Poll : తెలంగాణలో తప్పిన మరో ఉపఎన్నిక గండం..!
తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పింది. ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉండదంటున్నాయి సీఈసీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండటమే ఇందుకు కారణం. ఎన్నికలకు ఏడాదిలోపు సమయం ఉంటే బైపోల్ జరిగే అవకాశం లేదంటున్నాయి ఈసీ వర్గాలు.

Secunderabad Cantonment By Poll : తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పింది. ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉండదంటున్నాయి సీఈసీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండటమే ఇందుకు కారణం. ఎన్నికలకు ఏడాదిలోపు సమయం ఉంటే బైపోల్ జరిగే అవకాశం లేదంటున్నాయి ఈసీ వర్గాలు.
Also Read..YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల
2019 జనవరి 17న ఎమ్మెల్యేగా సాయన్న ప్రమాణస్వీకారం చేయగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నిలకు ఏడాది కూడా సమయం లేదు. దీంతో ఉపఎన్నిక జరిగే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ కంటోన్మెంట్ ఉపఎన్నిక వస్తే తెలంగాణలోని పార్టీలన్నీ వచ్చే ఎన్నికలకు రెఫరెండంగా భావించే అవకాశం ఉంది. గెలుపు కోసం చావో రేవో అన్నట్లు పార్టీలు కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. అయితే, బై పోల్ లేకపోవడంతో కోట్ల రూపాయల భారత తప్పిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
Also Read..Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు