YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల

ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila  :ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహబూబాబాద్ లో బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో పాదయాత్రను అడ్డుకున్నారని చెప్పారు. 2,100 ఎకరాల భూమిని శంకర్ నాయక్ కబ్జా చేశారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేసింది బీఆర్ఎస్ నేతలేనని తెలిపారు.

తమ పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని వాపోయారు. శంకర్ నాయక్ సంబంధించిన వీడియోను వైఎస్ షర్మిల ప్రదర్శించారు. ప్లాట్లు ఇస్తామని జర్నలిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. కొజ్జా అనే పదం మొదట వాడింది ఎమ్మెల్యే శంకర్ నాయక్ అని గుర్తు చేశారు. ‘మాట నిలబెట్టుకోకపోతే మీరు కొజ్జా అని నేను మాట్లాడితే తప్పా’? అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీని మ్యానేజ్ చేస్తూ.. ఎనిమిదిన్నరేళ్లుగా అధికార పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలింపు

ఎమ్మెల్యే మాటలకు రియాక్ట్ కావడం తప్పా అని ప్రదర్శించారు. IAS అధికారి చేతి పట్టుకున్న శంకర్ నాయక్.. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. శంకర్ నాయక్ తమపై దాడి చేయించారని ఆరోపించారు. వాళ్ళ అవినీతి ఎత్తి చూపితే తప్పా? అని నిలదీశారు. ఒకరు మరదలు అంటే తప్పు లేదా?.. ఇంకొకరు శిఖండి అంటే తప్పులేదా ? నల్లిని నలిపినట్లు నలుపుతా అంటే తప్పులేదా ? అని నిలదీశారు.

శంకర్ నాయక్ భార్య కూడా గిరిజన భూమి కబ్జా కేసులో A1గా ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లే దాడి చేస్తున్నారు… వాళ్లే పాదయాత్రను అడ్డుకుంటున్నారని వాపోయారు. అవినీతి ఎమ్మెల్యేలపై ఎందుకు విచారణ జరిపించండి లేదని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదిస్తున్నారు.. కాబట్టే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తా అని కేసీఆర్ చెబుతున్నారని పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నిస్తే తప్పా? అని నిలదీశారు.

YS Sharmila SC, ST Case : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

మహిళలు అంతా కేసీఆర్ పై తిరగబడాలని పిలుపునిచ్చారు. మహిళల గౌరవం మహిళలే నిలబెట్టుకోవాలన్నారు. అధికార మదం, కండకావరంతో తన పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదన్నారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.