Kamareddy : కరోనా..మా ఊరిలోనా ! ఒక్క కేసు నమోదు కాని ఊరు

వేవ్‌ల మీద వేవ్‌లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు... ఇంతకి ఆ ఊరేది ?

Kamareddy : కరోనా..మా ఊరిలోనా ! ఒక్క కేసు నమోదు కాని ఊరు

Kamareddy

Updated On : May 24, 2021 / 2:10 PM IST

No Corona Cases : వేవ్‌ల మీద వేవ్‌లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు… ఇంతకి ఆ ఊరేది ?

ఏక్షణం ఎవరికి వెంటిలేటర్‌ అవసరమవుతుందో.. ఏక్షణం ఎవరికి ఆక్సిజన్‌ కొరత వస్తుందోనని దేశమంతా టెన్షన్‌ పడుతోంది. అయినవారు.. తెలిసిన వారు.. కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే .. ఆందోళన, ఆవేదన పెరిగిపోతోంది. కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం హాయిగా చల్లని పిల్లగాలి పీల్చుకుంటూ.. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో కరోనా పప్పులుడకడం లేదు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నారు. మాస్క్‌ మస్ట్ చేశారు.. ఎక్కడికక్కడ భౌతికదూరం పాటిస్తున్నారు.. పెళ్ళిళ్లు, చావులకు పొరుగూరుకు వెళ్లడం లేదు.. పండుగలు, ఫంక్షన్లు అంటూ పక్కూరోళ్లని తమ గ్రామ పొలిమేరలకూ రానివ్వడం లేదు. ఇక కరోనా ఎందుకొస్తుంది చెప్పండి. అందుకే ఈ గ్రామ ప్రజలు ఎవరికి వారు హాయిగా చల్లని పిల్లగాలి పీల్చుకుంటూ వీధుల్లోనూ.. పొలాల్లోనూ గడిపేస్తూ.. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు.వేవ్‌ల మీద వేవ్‌లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు… ఇంతకి ఆ ఊరేది ?