FASTag లేకుండా..ORRపైకి వెళ్లారో..బాదుడే

FASTag తీసుకోలేదా ? ఆ ఏమవుతుంది..అంటూ ORRపైకి వెళుతున్నారా.. అయితే మీకు భారీగానే ఫైన్ విధించే అవకాశం ఉంది. అదనపు బాదుడు తప్పదని HMDA అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫాస్టాగ్ లేన్‌లో ఇతర వెహికల్స్ వెళితే..రెట్టింపు టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో రాయితీని కూడా కేవలం ఫాస్టాగ్ వాహనాలకు మాత్రమే వర్తింపచేయనున్నారు.
ఈ కొత్త నిబంధనలు 2020, మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి..ORRపై ఓ టోల్ గేట్ వద్ద ఫెక్ల్సీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన FASTag విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. HMDA RF ID FASTag సేవలను ఏడాది కిందట ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ వాహనాలు వెళ్లేందుకు వీలుగా అన్ని ఇంటర్ ఛేంజ్ కేంద్రాల దగ్గర ప్రత్యేకంగా ETC (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) లేన్లను అందుబాటులోకి తెచ్చారు.
అయితే..తొందరగా వెళ్లాలని కొంతమంది ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళుతున్నారు. ఇక నుంచి అలా వెళితే..రెట్టింపు టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణానికి కూడ ఒకేసారి టోల్ చెల్లిస్తే..కొంత రాయితీని ఇస్తున్నారు. ఇప్పుడా రాయితీని కూడా ఫాస్టాగ్ వాహనాలకే పరిమితం చేయాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. ORRపై ప్రతి రోజు…1.2 లక్షల వాహనాలు దూసుకెళుతున్నాయి. మొత్తం 158 కి.మీటర్లు ఉంటుంది.
19 ఇంటర్ ఛేంజ్‌ల దగ్గర వాహనాలు పైకి ఎక్కేందుకు వీలుగా అప్, డౌన్ ర్యాంపులుంటాయి. ఇక్కడే టోల్ రుసుంను వసూలు చేసేందుకు 180 టోల్ లేన్లు ఏర్పాటు చేశారు. స్టిక్కర్‌ను వాహనం ముందు అతికించుకుని..రీ ఛార్జీ చేసుకోవాలి. టోల్ ప్లాజా దగ్గరికి రాగానే..గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఈ స్టిక్కర్లను విక్రయించేందుకు కీలక ఇంటర్ ఛేంజ్‌ల దగ్గర ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read More : కరోనా వైరస్..ఉపాసన చెప్పిన సూచనలు, జాగ్రత్తలు