HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది ఏసీబీ.

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

HMDA Former Director Shiva Balakrishna Case

Shiva Balakrishna Case : HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది ఏసీబీ. శివ బాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

శివ బాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. వీటితో పాటు కుటుంబసభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Also Read : గులాబీ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్‌గా ఇదే..

తెలంగాణతో పాటు ఏపీలోని విశాఖపట్నంలో శివ బాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. శివ బాలకృష్ణ ఆస్తులకు శివ నవీన్ బినామీగా ఉన్నట్లు విచారణలో తేలింది.

Also Read : కేసీఆర్ ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. 8 రోజుల పాటు విచారించారు. 250 కోట్ల మేర శివ బాలకృష్ణ అక్రమాస్తులు గుర్తించారు. అలాగే, 214 ఎకరాల ఆస్తి పత్రాలు కూడా గుర్తించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని శివ బాలకృష్ణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణ దశలో ఉన్నందున శివ బాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ కోరింది. కేసు విచారణలో ఉన్న ఈ తరుణంలో శివ బాలకృష్ణకు బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అలాగే, అతడికి సంబంధించిన అధికారుల పాత్రపైనా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, చాలా మంది బినామీ ఆస్తులను గుర్తించాము, ఆయన సోదరుడిని కూడా అరెస్ట్ చేశామని కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు.. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.