Khammam : తోటి ఉద్యోగి వేధింపులు.. నర్సు ఆత్మహత్య
తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Khammam
Khammam : తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లడకు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ స్థానికంగా హాస్టల్ లో ఉంటుంది. ఇదే సమయంలో ఆసుపత్రిలో పనిచేసే మధు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో లోబరుచుకున్న మధు.. కొంతకాలం తర్వాత వేధింపులు మొదలు పెట్టాడు.
Read More : AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు
బాలిక నుంచి డబ్బుకూడా తీసుకున్నాడు. రోజు రోజుకు మధు వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన బాలిక అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతి విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి దండ్రులు ఫిర్యాదు మేరకు మధు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : Zero Size : జీరో సైజుకోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత