Mine Accident : మంచిర్యాల గని ప్రమాదంలో ఒకరి మృతదేహం వెలికితీత

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో చనిపోయిన నలుగురు కార్మికుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చింది.

Mine Accident : మంచిర్యాల గని ప్రమాదంలో ఒకరి మృతదేహం వెలికితీత

Singareni (1)

Updated On : November 10, 2021 / 5:29 PM IST

One Man’s body found : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో చనిపోయిన నలుగురు కార్మికుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చింది. మిగిలిని వారి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇటు గని బయట కార్మికులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్ పీ-3 బొగ్గు గనిలో ఈరోజు జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మొదటి షిఫ్టు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
కొందరు కార్మికులు దాని కిందే చిక్కుకుపోయారు.

Singareni Colleries : సింగరేణి గని ప్రమాదంలో 4కి చేరిన మృతుల సంఖ్య

మృతులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ గా గుర్తించారు. ఘటనా స్ధలంలోనే ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సింగరేణి రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది. చంద్రశేఖర్ మృతదేహాన్ని వెలికితీశారు.

గనిలో ప్రమాద వార్త విని కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. మృతుల కుటుంబాలు, బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్ పోలీసులు సంఘటన జరిగిన గని వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.