ధరణి పోర్టల్‌లో మొదటి రిజిస్ట్రేషన్‌..

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 06:35 AM IST
ధరణి పోర్టల్‌లో మొదటి రిజిస్ట్రేషన్‌..

Updated On : November 6, 2020 / 11:19 AM IST

dharani portal:మదనాపురంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ధరణి ద్వారా మొదటి రిజిస్ట్రేషన్‌ పూర్తి అయింది. దుప్పల్లి గ్రామానికి చెందిన బోయ తిరుపతమ్మకు చెందిన 1.34 ఎకరాలను ధరణి పోర్టల్‌లోకి ఎక్కించారు.




దుప్పల్లి గ్రామానికి చెందిన అల్లీపురం ఆంజనేయులు ఈ భూమిని కొనుగోలు చేశారు.




తాహసిల్దార్‌ సంధ్య కేవలం అరగంటలోనే ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేశారు. త్వరగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



మదనాపురం మండలంలో మొట్టమొదటి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆంజనేయులుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. ధరణిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని నేతలకు సూచించారు.