Chinna Jeeyar Swami : హైదరాబాద్ చేరుకున్న చిన్నజీయర్ స్వామి, ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
Chinna Jeeyar Swami: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు వస్తున్నారు. ఎయిర్ పోర్టు నుండి ఆశ్రమం వరకు స్వామి వారు ర్యాలీగా వెళ్లనున్నారు.

Chinna Jeeyar Swami
Chinna Jeeyar Swami : పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు భక్తులు ఘన స్వాగతం పలికారు.
చిన్నజీయర్ స్వామి ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించారు స్వామిజీ. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు వచ్చారు చిన్నజీయర్ స్వామి. ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకున్న భక్తులు స్వామీజీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
ఎయిర్ పోర్టు నుండి ఆశ్రమం వరకు భక్తులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అమ్మ విగ్రహం వద్దకు చేరుకుని మాలా సమర్పణం చేయనున్నారు చిన్నజీయర్ స్వామి. తర్వాత దివ్యసాకేతం పెద్దజీయర్ స్వామిజి దగ్గరకు చేరుకుంటారు. మాలా సమర్పణం చేయనున్నారు. అనంతరం ఆశ్రమంలో నేత్ర విద్యార్థులు, జీయర్ గురుకులం విద్యార్థులు వేడుకలు నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9మందికి పద్మభూషణ్ అవార్డులు ప్రకటించగా, అందులో ఒకరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి. ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, వైద్య, సామాజిక రంగాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్నజీయర్ స్వామిని పద్మభూషణ్ వరించింది.
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీరామనగరం పేరుతో ఆశ్రమం నెలకొల్పారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో తనదైన ముద్రవేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి. ఆధ్యాత్మిక రంగంలో చేసిన విశేష కృషికి గాను.. చినజీయర్‌స్వామికి ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది కేంద్రం. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో చినజీయర్‌స్వామి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారం అందుకున్నారు.