ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
Palla Rajeshwar Reddy: అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని..

Palla Rajeshwar
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దటూర్‌లో బలవన్మరణానికి పాల్పడిన బొజెడ్ల ప్రభాకర్ అనే రైతు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రి ఇంటికి కూత వేటు దూరంలో ఆ రైతు కుటుంబం ఉంటుందని చెప్పారు.
అయినప్పటికీ ఆ రైతు కుటుంబాన్ని మంత్రి పరామర్శించ లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రోజుకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నారని చెప్పారు. అశ్వారావుపేట సీఐ వేధింపుల వల్లే ఎస్ఐ మృతి చెందారని ఆరోపించారు. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదని చెప్పారు.
హిట్లర్, గోబెల్స్‌కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల కుటుంబానికి అన్యాయం చేస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. మాయమాటలు చెబుతూ అహంకారంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోలీసులు రాజకీయం చేయవద్దని హితవు పలికారు.
ఏపీ, తెలంగాణ మధ్య విభజన పంచాయితీ తేలేనా? ఇన్నాళ్లు ఏం జరిగిందో తెలుసా?