Peddapalli : కల్లు కోసం మూడు రోజుల ముందే ఆర్డర్.. ప్రత్యేకత ఏంటీ ?
చిలుక ఎంగిలి చేసింది కావడంతో ఆ కల్లుకు ఫిదా అయిపోతున్నారు. ఎంగిలి కల్లు అద్భుతమైన రుచి ఉందంటూ ఎగబడుతున్నారు. పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల

Kallu
Parrot Tasted Kallu Peddapalli district : కల్లు.. గ్రామాల్లో ఉన్న వారు తాటికల్లు ఔషధంగా పరిగణిస్తుంటారు. తాటికల్లులో విటమిన్లు, లవణాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయని అంటుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయానల్లో వెల్లడైంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. దానిన కల్లు ద్వారానే పరిష్కరించుకొనే వారని పెద్దలు అంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కల్లు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే.. ఓ ప్రాంతంలో కల్లు కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. దాదాపు మూడు రోజుల ముందుగానే ఫోన్ చేసి మరీ కల్లుకు ఆర్డర్ ఇస్తున్నారంట.
Read More : Srilanka Toddy : శ్రీలంక కొబ్బరి కల్లుకు విదేశాల్లో భలే గిరాకీ… ఆ టేస్టే వేరు గురూ..
అందులో ప్రత్యేకత ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? చిలుక ఎంగిలి చేసింది కావడంతో ఆ కల్లుకు ఫిదా అయిపోతున్నారు. ఎంగిలి కల్లు అద్భుతమైన రుచి ఉందంటూ ఎగబడుతున్నారు. పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. తాటిచెట్ల గెలకు మొరలు పెట్టాక వచ్చే కల్లును ముందుగానే చిలుకలు రుచి చూస్తున్నాయి. చిలుకలు ఎంగిలి చేసింది కావడంతో డిమాండ్ వచ్చింది. ఎంగిలి కల్లు రుచి అత్యద్భుతంగా ఉందంటూ కల్లు ప్రియులు లోట్టలు వేసుకుని తాగేస్తున్నారంట. పైగా.. చిలుకలు రుచి చూసిన కల్లు తాగితే మంచిదంటూ ప్రచారం సాగడంతో ఆ గ్రామానికి తాకిడి ఎక్కువైంది. చిలుక ఎంగిలి కల్లు ఉందా అంటూ అక్కడున్న గీతా కార్మికులను అడుగుతున్నారు. ఫుల్ డిమాండ్ ఉండడంతో ధర కూడా అమాంతం పెంచేశారు. పోద్దాడు కల్లు ఈ సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే దొరుకుతుంది. దీనికి చిలుక కూడా తోడవంతో కల్లుకు ఎనలేని గిరాకీ లభిస్తోంది.