Pastor Ajay Babu: పోలీసుల అదుపులో పాస్టర్ అజయ్ బాబు..

ఫాస్టర్ అజయ్ బాబును తుకారంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Pastor Ajay Babu: పోలీసుల అదుపులో పాస్టర్ అజయ్ బాబు..

Pastor Ajay Babu

Updated On : April 7, 2025 / 9:09 AM IST

Pastor Ajay Babu: ఫాస్టర్ అజయ్ బాబును తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లను విమర్శిస్తూ అనవసర మత కల్లోలాలకు తెరలేపుతున్నారంటూ ఫాస్టర్ జోసఫ్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అంతేకాక.. ఫాస్టర్ ప్రవీణ్ మరణంపై అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫాస్టర్ అజయ్ బాబును అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిసింది.

 

ఖమ్మం నగరం జయనగర్ కాలనీకి చెందిన ఫాస్టర్ అజయ్ బాబు ను హైదరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లారని ఖానాపురం హవేలీ ఇన్ స్పెక్టర్ భాను ప్రకాశ్ ఆదివారం తెలిపారు. తుకారంగేట్ పోలీస్ స్టేషన్ లో పాస్టర్ జోసఫ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసు బృందం అజయ్ బాబును విచారణకు తీసుకెళ్లినట్లు తెలిపారు.

 

ఇదిలాఉంటే.. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై మత ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్ లోని తుకారాంగేట్, ఉప్పల్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.