Assembly Elections 2023: పెద్దపల్లిలో రాహుల్ గాంధీ పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన పటేల్ ప్రభాకర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Patel Prabhakar Reddy
Patel Prabhakar Reddy: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఓ జెడ్పీటీసీ, ఇద్దరు మాజీ ఎంపీపీలు, మాజీ కోఆప్షన్ మెంబర్ రాజీనామా చేశారు.
ఓదెల జెడ్పీటీసీ గంట రాములు యాదవ్, సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, మాజీ కోఆప్షన్ మెంబర్ హాజీ తదితరులు మూకుమ్ముడిగా రాజీనామా చేశారు. పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కాంగ్రెస్‌కి గద్వాల జిల్లా అధ్యక్షుడి రాజీనామా
జోగులాంబ గద్వాల జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కొందరు నిరసన తెలపడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ ఫ్లెక్సీలను కాల్చేశారు. తమ నాయకుడికి గద్వాల టికెట్ దక్కలేదని ఆందోళనలకు దిగారు. మరోవైపు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన పటేల్ ప్రభాకర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.