Ana Konidela: విద్యార్థినుల స్కూల్ ఫీజులు చెల్లించి.. పవన్ సతీమణి అనా కొణిదెల సేవా కార్యక్రమాలు

ప్రజలకు పవన్ కల్యాణ్ హ్యాపీ న్యూఇయర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Ana Konidela: విద్యార్థినుల స్కూల్ ఫీజులు చెల్లించి.. పవన్ సతీమణి అనా కొణిదెల సేవా కార్యక్రమాలు

Ana konidela

Updated On : December 31, 2023 / 9:40 PM IST

న్యూ ఇయర్ వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల హైదరాబాద్‌లో ‘ఫ్రెండ్స్’ స్వచ్ఛంద సంస్థ అనాథ శరణాలయాన్ని సందర్శించారు. అనాథ చిన్నారులతో ముచ్చటించి కేక్ కట్ చేశారు.

చిన్నారుల చదువుల గురించి తెలుసుకున్నారు. అలాగే, అయిదుగురు విద్యార్థినుల స్కూల్ ఫీజులు చెల్లించారు. ఆ అనాథ శరణాలయానికి నిత్యావసర సరకులతో పాటు చిన్నారులకు అవసరమైన సామగ్రిని అందించారని జనసేన పార్టీ తెలిపింది.

అనా కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవలే హైదరాబాద్‌‌లోని బాలాజీ స్వర్ణపురి కాలనీలోని జీవోదయ బాలల గృహంలో చిన్నారులతో ఆమె క్రిస్మస్‌ వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పిల్లలో కేక్ కట్ చేయించారు. పిల్లలతో సరదాగా గడిపారు.

మరోవైపు, ప్రజలకు పవన్ కల్యాణ్ హ్యాపీ న్యూఇయర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి అలాంటి అలవాటు ఉందని.. ఎవరూ అనుకోరు.. శృతిహాసన్ కామెంట్స్