Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి అలాంటి అలవాటు ఉందని.. ఎవరూ అనుకోరు.. శృతిహాసన్ కామెంట్స్
పవన్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా శృతిహాసన్ నిలిచారు. దీంతో పవన్ కి సంబంధించిన కొన్ని అలవాట్లు పై శృతికి ఓ ఐడియా ఉంది. తాజాగా..

Shruti Haasan comments about Pawan Kalyan habbits video gone viral
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’తో నటించి కెరీర్ లో మొదటి హిట్టుని అందుకున్న శృతిహాసన్.. ఆ తరువాత కాటమరాయుడు, వకీల్ సాబ్ సినిమాల్లో కూడా నటించి అలరించారు. పవన్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా శృతిహాసన్ నిలిచారు. దీంతో పవన్ తో శృతికి కొంచెం స్నేహం బంధం ఎక్కువగానే ఉంది. ఈ స్నేహంతో పవన్ కి సంబంధించిన కొన్ని అలవాట్లు పై శృతికి ఓ ఐడియా ఉంది.
ఈక్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్.. పవన్ కి సంబంధించిన ఓ అలవాటు గురించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శృతిహాసన్, సాయి ధరమ్ తేజ్, శ్రియారెడ్డి, దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత శోభు యార్లగడ్డ.. కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ కి లెగో బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉందని ఎవరూ అనుకోరు” అంటూ వ్యాఖ్యానించారు.
Also read : Vijay : విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. సుడిగాలి సుధీర్ టైటిల్ కొట్టేసిన దళపతి..
ఇక ఈ విషయం గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మా చిన్నప్పుడు ఆయన మాతో కలిసి లెగోస్ ఆడుకునేవారు. నిజానికి ఆయనే ఆడుకుందాం రా అని పిలిచేవారు. నేనెప్పుడైనా లెగోస్ కొనుకుంటే.. ఆయనికి ఓ సెట్ తీసుకుంటా. మా అమ్మ కూడా ఆయన బర్త్ డేకి ఆయనకి లెగోస్ కొనుకోమని డబ్బులు బహుమతిగా ఇచ్చేది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Pawan Kalyan loves Lego anta .. inthaki ee Lego ante ? Cartoon bommala ? pic.twitter.com/kMAE95wtHM
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) December 30, 2023
కాగా పవన్ కూడా ఈ విషయం గురించి చాలా సార్లు మాట్లాడారు. అవి ఆడడం ఇంటరెస్టింగ్ ఉండేదని పలు వేదికల పై బహిరంగంగా చెప్పారు. చిరంజీవి కూడా ఫారిన్ కంట్రీస్ కి షూటింగ్ కి వెళ్ళినప్పుడు.. అక్కడి నుంచి రామ్ చరణ్‌కి, ఇంటిలో ఇతర పిల్లలకి బొమ్మలు తెచ్చేవారట. వారితో పాటు పవన్ కి కూడా బొమ్మలు తీసుకు వచ్చేవారని.. చిరంజీవే స్వయంగా చెప్పారు.