ఓ బ్రోకర్ ఖతర్నాక్ ప్లాన్.. కూతురు పెళ్లికి రూ.4 లక్షలు ఇచ్చి.. ఇంటి పేపర్లు తీసుకుని.. దాని మీద కోటి రూపాయల లోన్ తీసుకుని..
ఇంటి ఓనర్ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ బ్రోకర్ అతన్ని మోసంచేసి ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. కోటి రూపాయలు తీసుకున్నాడు.

house owner Bhushan
Hyderabad: కుటుంబ పెద్ద అవసరాన్ని ఓ బ్రోకర్ ఆసరాగా తీసుకున్నాడు. నీ కుతురు పెండ్లికి కావాల్సిన డబ్బు ఇస్తానంటూ నమ్మించాడు. బాధితుడి ఇంటిని తన భార్యపేరుపై రాయించుకొని రూ.నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తరువాత ఆ ఇంటి డాక్యూమెంట్లు పెట్టి బ్యాంకులో కోటి రుణం తీసుకున్నాడు. నెలనెలా ఈఎంఐ కట్టకపోవటంతో బ్యాంకర్లు ఇంటిని జప్తు చేసేందుకురాగా అసలు విషయం తెలిసి బాధిత కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో చేసేదేమీలేక ఒంటిపై డీజిల్ పోసుకొని కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాధితుల తరపు అడ్వకేట్ తో కలిసి బ్యాంక్ కు వెళ్లి అధికారులతో మాట్లాడారు.
Also Read: Rahul Dravid : బెంగళూరులోని రద్దీ రోడ్డు పై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ గొడవ.. వీడియో వైరల్
హైదరాబాద్ లోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రకాశ్ నగర్ కు చెందిన భూషణ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అనసూయ, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. కూతురు పెండ్లి నిశ్చయం కావడంతో డబ్బులు అప్పు కావాలని దినకర్ అనే బ్రోకర్ ను భూషణ్ ఆశ్రయించాడు. ఓ ప్రైవేట్ ఫైనాన్సియర్ వద్దకు తీసుకెళ్లి లోన్ ఇప్పిస్తానని భూషణ్ ను దినకర్ నమ్మించాడు. తన భార్య రజనీకి ఇంటిని అమ్మినట్లు భూషణ్ చేత పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఆ తరువాత భూషణ్ కుటుంబానికి రూ.4లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత భూషణ్ ఇంటి డాక్యూమెంట్లను ఓ బ్యాంకులో దినకర్ మార్టిగేజ్ చేసి రూ. కోటి రుణం తీసుకున్నారు. అయితే, కేవలం 35లక్షలు మాత్రమే లోన్ తీసుకున్నట్లు భూషణ్ కుటుంబాన్ని దినకర్ నమ్మించాడు.
Also Read: కులగణనపై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఏం జరుగుతోందో తెలుసా?
కోటి రూపాయల వరకు రుణం తీసుకున్న దినకర్ నెలనెలా బ్యాంకుకు కట్టాల్సిన ఈఎంఐలను కట్టడం లేదు. బ్యాంకు అధికారులు పలుసార్లు దినకర్ ను ప్రశ్నించినా ఈఎంఐలు కట్టేందుకు దినకర్ ముందుకు రాలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రకాశ్ నగర్ లోని తమ తాకట్టులో ఉన్న ఇంటి వద్దకు వెళ్లారు. తమ ఇంటిని జప్తు చేయొద్దని బ్యాంకర్లను భూషణ్ వేడుకున్నాడు. అయినా బ్యాంకర్లు వినకపోవడంతో భూషణ్, అతని భార్య, వారి కొడుకు ఇంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.