Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాం.. అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాం.. అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు..

Updated On : June 9, 2025 / 12:39 AM IST

Phone Tapping Case: మాజీ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సిట్ విచారణకు ఆయన హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వెలుగులోకి రాగానే అమెరికాకు వెళ్లిపోయారు. దాదాపు 14 నెలలు అమెరికాలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ రావు.. సోమవారం సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

Also Read: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. వారికి కేటాయించే శాఖలు ఇవే..

మరోవైపు ప్రభాకర్ రావుకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాకర్ రావుని ఆపేశారు. విచారణ అధికారికి సమాచారం ఇచ్చారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. విచారణ అధికారి నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రాసెస్ మెదలు పెట్టారు అధికారులు. రెడ్ కార్నర్ నోటీస్ ఉండటంతో విచారణ అధికారికి సమాచారం ఇచ్చారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.

 

ప్రభాకర్ రావుని విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సిట్ అధికారులు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో సంచలనం రేపింది. ఈ కేసులో చాలామంది అధికారులను అరెస్ట్ చేశారు. తిరుపతన్న, భుజంగరావు, రాధాక్రిష్ణ ఇలా చాలామందిని అరెస్ట్ చేశారు. వారిచ్చిన స్టేట్ మెంట్ ను బేస్ చేసుకుని ప్రభాకర్ రావుని కూడా పూర్తిగా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

కాగా.. అత్యవసర ప్రయాణ పత్రాలు అందిన వెంటనే భారత్ కి తిరిగి వస్తానని, సిట్ అధికారుల దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన ఇటీవల సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్ చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో పురోగతి సాధించాలని SIT ఆశిస్తోంది. ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి రావడానికి వీలుగా పాస్‌పోర్ట్‌ను ఆయనకి తిరిగి ఇవ్వాలని మే 29న సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.

పాస్‌పోర్ట్/ప్రయాణ పత్రం అందిన మూడు రోజుల్లోపు తాను భారతదేశానికి తిరిగి వస్తానని హామీ ఇస్తూ అఫిడవిట్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లు బి.వి. నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.