PM Modi : మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. నేడు నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తారు.

PM Modi : మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ.. నేడు నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

PM Modi Telangana Tour

PM Modi Telangana Tour : ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రధాని మరోసారి తెలంగాణకు రానున్నారు. నేడు (మంగళవారం) మోదీ తెలంగాణకు రానున్నారు. ఇప్పటికే ఒక దశ తెలంగాణలో పర్యటించిన ప్రధాని మంగళవారం మరోసారి వస్తున్నారు. మొన్న (ఆదివారం) పాలమూరులో రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించిన ప్రధాని హిందూర్ వేదికగా ఏం ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది. అంతేకాదు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని మోదీ తొలుత ఇవాళ (మంగళవారం) ఛత్తీస్ గఢ్ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు బస్తర్ జిల్లాలోని జగదల్ పూర్ కు చేరుకోనున్న ప్రధాని రూ.23,800 కోట్లతో నిర్మించిన ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బస్తర్ జిల్లాలో ప్రపంచ ఉక్కు పటంలో ప్రముఖ స్థానానికి చేరుకోనుంది. ఇక జగదల్ పూర్ రైల్వే స్టేషన్ అప్ గ్రేడ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు. ఛత్తీస్ గఢ్ లో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా

ఇక కుంకూరి నుంచి ఛత్తీస్ గఢ్ – జార్ఖండ్ సరిహద్దు వరకు రోడ్డు అబ్రివేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. విద్యుత్, రైల్వే, ఆరోగ్య రంగాలకు సంబంధించి రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మధ్యాహ్నం 3.45 గంటలకు గిరిరాజ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు.

నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తారు. అలాగే రూ.3500 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తైన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

Bihar Caste Survey: బిహార్ కులగణనపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కలకలం.. కులగణనపై నితీశ్ మోసం చేశారట

మరో రూ.1200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మనోహర బాద్ – సిద్దిపేట రైల్వే లైన్ ను ప్రారంభిస్తారు. తెలంగాణలో ఎన్నికల వేళ మూడు రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రావడం బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుంది. ఇందూర్ పర్యటనలో భాగంగా ప్రధాని చేయనున్న ప్రకటనలపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

దక్షిణ భారతదేశానికి వెలుగులు అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండ ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కర్మగారాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ఇవాళ నిజామాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాతికి అంకితం చేయనున్నారు.
ఇప్పటికే పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ పవర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

Earthquake : ఈశాన్య రాష్ట్రాలను వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో భూప్రకంపనలు

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 4 వేల మెగావాట్ల విద్యుత్ కర్మాగారాన్ని
మంజూరు చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ ద్వారా రామగుండంలో విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి రామగుండం ఎన్టీపీసీ సంస్థ ముందుకు రావడంతో మొదటి విడతగా 1600 మెగావాట్ల 2 యూనిట్లను ఎన్టీపీసీ నిర్మించింది.

అందులో భాగంగా పూర్తైన మొదటి యూనిట్ ను ఇవాళ ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 800 మెగావాట్ల విద్యుత్ లో 85 శాతం తెలంగాణ అవసరాలకు వినియోగించనున్నారు. మిగిలిన 15 శాతం విద్యుత్ ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఎన్టీపీసీ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే పూర్తైన రెండో యూనిట్ విద్యుత్ కర్మాగారాన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు.

BRS : గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న కృష్ణార్జునులు, మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం

ప్రారంభోత్సవ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్ షిప్ లలోని కాకతీయ ఆడిటోరియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుంది. ఇందుకు సంబంధించి ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేక స్ర్కీన్లను ఏర్పాటు చేసింది.