139మంది రేప్ కేసులో కీలక నిందితుడు డాలర్ బాయ్ గోవాలో అరెస్ట్

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 03:29 PM IST
139మంది రేప్ కేసులో కీలక నిందితుడు డాలర్ బాయ్ గోవాలో అరెస్ట్

Updated On : October 23, 2020 / 4:18 PM IST

dollar bhai: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139 మంది అత్యాచారం కేసులో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రాజశ్రీకర్‌ అలియాస్‌ డాలర్‌భాయ్‌ని గోవాలో అరెస్ట్ చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

అయితే డాలర్‌ భాయ్‌ ఒక్కడే తనపై లైంగిక దాడి చేసినట్లు స్టేట్‌మెంట్‌లో చెప్పింది బాధితురాలు. దీంతో నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. డాలర్‌భాయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. తనపై 139మంది అత్యాచారం చేశారంటూ ఆగస్టు 20న బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు పంజాగుట్ట పోలీసులు.