Drug Case : డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేశారు. నలుగురు వ్యక్తుల నుండి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.

Drug Case : డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

three arrest in drug case

Updated On : August 31, 2023 / 4:59 PM IST

Three Arrest In Drug Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 2.8 గ్రాముల కోకైన్, 6 ఎల్ ఎస్ డి బోల్ట్, 25 ఎస్టాకి పిల్స్, 72,000 నగదు, ఐదు సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టును ధ్రువీకరించారు. డ్రగ్స్ కేసులో బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

గతంలో నిందితుడు బాలాజీ నేవీలో ఉద్యోగం చేశారు. బాలాజీ తరచూ ఫ్రేష్ లివింగ్ అపార్ట్మెంట్ లో పార్టీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో బాలాజీకి సంబంధాలు ఉన్నాయి. అలాగే నైజీరియన్లతో బాలాజీకి నేరుగా సంబంధాలు ఉన్నాయి. బాలాజీ బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.

Tollywood Drugs: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో పలువురు సినీ ప్రముఖులు!

సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేశారు. నలుగురు వ్యక్తుల నుండి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉంది. వెంకట్, బాలాజీ తరచూ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్ పార్టీలో అమ్మాయిలను సైతం వెంకట్ సప్లై చేశాడు. గుడిమల్కాపూర్ పీఎస్ లో బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు.

బాలాజీ ఇచ్చిన సమాచారం ద్వారా మాదాపూర్ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడులు చేశారు. నలుగురు డ్రగ్ సప్లయర్లతోపాటు, ముగ్గురు నైజీరియన్లతోపాటు మరో 18 కన్జ్యూమర్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరూ అమ్మాయిల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తామన్న పేరుతో వెంకట్ ఢిల్లీ నుండి ఇక్కడికి యువతులను రప్పించినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ లింకులపై హెచ్ న్యూ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

SI Rajender : నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మాయం.. సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ అరెస్టు, రిమాండ్ కు తరలింపు

హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీని గురువారం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్నవారి నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని అధికారులు అరెస్టు చేశారు. వీరిలో సినీ నిర్మాత వెంకట్ తోపాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన వారిని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.