ప్రజాపాలనలో దరఖాస్తు చేయనివారు స్పెషల్ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు: పొంగులేటి
ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని పొంగులేటి చెప్పారు.

Minister Ponguleti Srinivasa Reddy
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
“పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇళ్లు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 4.50 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారు.
ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫొటో తీసి యాప్ లో నమోదు చేస్తాం. ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌస్‌లు సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుంది. గత ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారు. దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు” అని పొంగులేటి తెలిపారు.
Allu Arjun Arrested: ఇదే లాజిక్ రేవంత్ రెడ్డికి వర్తించదా..? అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్