కులగణనలో కవిత పేరు నమోదు చేసుకున్నారు.. కేటీఆర్, హరీశ్‌ కూడా నమోదు చేసుకోవాలి: పొంగులేటి

గత బీఆర్ఎస్‌ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టారని పొంగులేటి ఆరోపించారు.

కులగణనలో కవిత పేరు నమోదు చేసుకున్నారు.. కేటీఆర్, హరీశ్‌ కూడా నమోదు చేసుకోవాలి: పొంగులేటి

Minister Ponguleti Srinivasa Reddy

Updated On : November 18, 2024 / 6:29 PM IST

Ponguleti Srinivasa Reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కులగణనలో పేరును నమోదు చేసుకోవడం అభినందనీయమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్‌ రావు కూడా కలగణనలో నమోదు చేసుకోవాలని చెప్పారు.

గత బీఆర్ఎస్‌ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టారని పొంగులేటి ఆరోపించారు. లగచర్ల ఘటనపై రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసినట్లు తాము చెయ్యడం లేదని చెప్పారు.

తమది రైతుల ప్రభుత్వమని, రైతులను ఇబ్బంది పెట్టదని పొంగులేటి తెలిపారు. 67 లక్షల 72 వేల 246 కుటుంబాలను నిన్నటి వరకు కులగణన చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో అత్యధికంగా 87శాతం, నల్గొండ 81 శాతం, జనగాం 77శాతం, హైదరాబాద్ లో 38శాతం జరిగిందని వివరించారు.

ఈ సమాజాన్ని స్కాన్ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందవని పొంగులేటి అన్నారు. ఈ సర్వే వల్ల ప్రతిపక్షాల ఉనికికే ప్రమాదం అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సర్వే వల్ల పథకాలు ఆగవని, సర్వే పూర్తి అయినా పథకాలు రాని వాళ్లకు సైతం పథకాలు అందుతాయని చెప్పారు. తాను, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నామని తెలిపారు.

ఇకపై ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత..! ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం