Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

‘హైదరాబాదీ ఫ్రాంక్స్’ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే...ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కాస్తా పెద్దదిగా అయ్యింది.

Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

Prank Hyd

Updated On : July 29, 2021 / 5:44 AM IST

Prank Call Gone Wrong : ఫ్రాంక్ వీడియోస్..యూ ట్యూబ్ లో చాలా మంది వీటిని అప్ లోడ్ చేస్తుంటారు. ప్రజలపై ప్రయోగాలు చేస్తూ..చివరకు ఫ్రాంక్ అని ఆటపట్టిస్తుంటారు. అయితే..కొన్ని సందర్భాల్లో ఇవి బెడిసి కొడుతుంటాయి. ఘర్షణలకు, దాడులకు కారణమౌతుంటాయి. ఇది ఫ్రాంక్ వీడియో అని ఎంత మొత్తుకున్నా..అవతలి వ్యక్తులు వినకుండా దాడులకు దిగుతుంటారు. సరిగ్గా ఇలాగే జరిగింది మహానగరంలో. ఓ ఛానెల్ కు చెందిన వారు ఫ్రాంక్ వీడియ చేద్దామని ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. అక్కడ యజమానితో గొడవకు దిగారు. ఆవేశానికి లోనైన యజమాని…ఫ్రాంక్ చేస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసుల వరకు తెలిసింది. ఇంకేముంది..ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

Read More : Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

వివరాల్లోకి వెళితే…

‘హైదరాబాదీ ఫ్రాంక్స్’ పేరిట ఓ యూ ట్యూబ్ ఛానల్ ఉంది. వీరు ఫ్రాంక్స్ వీడియోస్ చేస్తుంటారు. ఇలాగే…ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ కు వచ్చారు. అక్కడ ఓ మొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కాస్తా పెద్దదిగా అయ్యింది. ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. ఇది ఫ్రాంక్ వీడియో అని..అక్కడ కెమెరా ఉందని..కావాలని చేస్తున్నామని యాంకర్ చెప్పినా..యజమాని వినిపించుకోలేదు. యాంకర్ ను చితకబాదాడు. విషయం ఆబిడ్స్ పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.