Draupadi Murmu : జులై 12న తెలంగాణ రానున్న ద్రౌపది ముర్ము..

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈసందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.

Draupadi Murmu : జులై 12న తెలంగాణ రానున్న ద్రౌపది ముర్ము..

Draupadi Murmu Will Meet Telangana Bjp Mlas

Updated On : July 9, 2022 / 12:15 PM IST

draupadi murmu will meet telangana bjp mlas : ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ( జులై 12,2022) తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈసందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను కలువనున్నారు.

ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్​డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌‌‌‌‌‌‌‌గానూ పనిచేసిన ముర్ము రాజకీయాల్లో కింది స్థాయి పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి చేరుకున్నారు. కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీపడే స్థాయికి ముర్ము అంచెలంచెలుగా ఎదిగారు. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టించనున్నారు.

Also read : Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం