Priyanka Gandhi: ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: హైదరాబాద్, సరూర్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు.

Priyanka Gandhi: ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: ప్రియాంక గాంధీ

Yuva Sangharshana Sabha

Priyanka Gandhi: యువత త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. హైదరాబాద్, సరూర్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన యువ సంఘర్షణ సభ(Yuva Sangharshana Sabha)లో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. “జై బోలో తెలంగాణ” అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

“మట్టి కోసం త్యాగాలు చేయడం నాకు అనుభవం.. దేశం కోసం నా కుటుంబంలో కూడా త్యాగాలు చేశారు.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తెలంగాణ కోసం యువత ప్రాణ త్యాగాలు చూసి సోనియమ్మ తల్లడిల్లారు. తెలంగాణ అంటే ఒక భూమి ముక్క కాదు. మీరు తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారు.

ఇది అత్యంత పవిత్రమైన అంశం.. తెలంగాణ కోసం చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. యువత ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పాటు అయింది. అంబేద్కర్, పూలే, కుమ్రం భీం ఆశయాలను నెరవేర్చాలి. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు ఇంకా నెరవేరలేదు. మన స్వప్నం నెరవేరడం లేదు.

తెలంగాణ ప్రదేశ్ వారి జాగీర్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కలలు నెరవేర్చడం లేదు. ఇక్కడ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువకులకు 3 వేల భృతి ఇష్టం అన్నారు.. ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.. భృతి లేదు.

చాలా హామీలు ఇచ్చారు.. ఒక్కటి కూడా నెరవేరలేదు. పాఠశాలల్లో సౌకర్యాలు లేవు. తెలంగాణ మీది. మీ త్యాగాల వల్ల వచ్చింది.. తెలంగాణను బాగు చేసుకోవడంలో మీద ఎక్కువ బాధ్యత ఉంది. మీరు చైతన్యంతో ఉండి పని చేయాలి.. లేకపోతే నష్టపోయేది యువతనే” అని ప్రియాంక గాంధీ చెప్పారు.

నన్ను నయా ఇందిరమ్మ అంటున్నారు
తనను నయా ఇందిరమ్మ అంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. “ఇది మామూలు మాట కాదు.. ఇది పెద్ద మాట. ఇందిరమ్మ 40 ఏళ్ల కింద దేశం కోసం త్యాగం చేసినా ఇంకా మీరు గుర్తు పెట్టుకున్నారు. సోనియమ్మను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డను నేను.

ఎన్నికల ముందు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతారు.. ఎన్నికల తర్వాత చేతులు దులుపుకుంటారు. మీరు బైబై మోదీ, బైబై కేసీఆర్ అనాలి. మేము ఇచ్చిన యూత్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మేము అమలు చేయకపోతే మళ్లీ ప్రభుత్వాన్ని దించేయండి” అని ప్రియాంక అన్నారు.

Youth Declaration: యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఇంకా ఎన్నో