Qatar Plane Emergency Landing : శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర లాండింగ్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.

Qatar Plane Emergency Landing : శంషాబాద్ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర లాండింగ్

Qatar Plane Emergency Landing

Updated On : July 27, 2023 / 11:06 AM IST

Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఖతార్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం దోహా నుండి నాగపూర్ వెళ్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు. గతంలో కూడా పలు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో పలుమార్లు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకుని వేగంగా గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి.

Godavari River Flood Water : భద్రాద్రి జిల్లాలో మరోసారి గోదావరి ఉగ్రరూపం.. రామాలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు

హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.