Riyaz : రాహుల్ గాంధీ ఎక్కడైనా పోటీ చేయగలరు.. అసదుద్దీన్ హైదరాబాద్ వదిలి ఎక్కడైనా పోటీ చేయగలడా? : డా.రియాజ్
ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు గొట్టాలని చూస్తున్నారు.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైద్రాబాద్ ది అపార త్యాగలు చేసిన చరిత్రని, ఎంఐఎం రాజాకారుల వారసత్వ పార్టీ అని అన్నారు.

TPCC Senior Spokesperson Riyaz
Riyaz – Asaduddin Owaisi : హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి పోటీ చేయాలన్నారని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి డా.రియాజ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడైనా పోటీ చేయగలరని ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని తెలిపారు. ‘నువ్వు హైదరాబాద్ వదిలి ఎక్కడైనా పోటీ చేయగలవా.. హైదదరాబాద్ వదిలితే నువ్వు చెల్లని రూపాయి’ అని అసదుద్దిన్ ఒవైసీని ఉద్దేశించి వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీని విమర్శిస్తున్నావంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావనే అర్థం అన్నారు.
ఈ మేరకు (మంగళవారం) ఆయన హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాడియాతో మాట్లాడారు. భారత్ జోడోయాత్ర ద్వారా దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. దొరలకు ఊడిగం చేసిన చరిత్ర ఎంఐఎందని విమర్శించారు. అప్పుడు నిజాం, ఇప్పుడు కేసీఆర్ కి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హిందూ, ముస్లీలం మధ్య వైశమ్యాలు రేకెత్తించాలని చూస్తున్నారని ఆరోపించారు.
MP Bandi Sanjay Kumar: గవర్నర్ నిర్ణయంపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు గొట్టాలని చూస్తున్నారు.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైద్రాబాద్ ది అపార త్యాగలు చేసిన చరిత్రని, ఎంఐఎం రాజాకారుల వారసత్వ పార్టీ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకిత బీ టీమ్ గా ఎంఐఎం పని చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో హైదరాబాద్ వదిలి బయటకు పోరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారని తెలిపారు. ప్రజలు ఎంఐఎంని గమనించాలన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు పాల్గొన్నారని పేర్కొన్నారు. పాతబస్తిలో అభివృద్ధి లేదని యువతని అణిచివేస్తున్నారని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన చరిత్ర ఎంఐఎందని.. అలాంటి వారితో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిఖార్సైనా సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు. సెక్యులర్ సమాజం కాంగ్రెస్ పార్టీ తో కలిసి నడవాలని కోరారు.