MP Bandi Sanjay Kumar: గవర్నర్‌ నిర్ణయంపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

MP Bandi Sanjay Kumar: గవర్నర్‌ నిర్ణయంపై స్పందించిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం సూచించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దీంతో తమిళిసై నిర్ణయం పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తమిళిసై నిర్ణయాన్ని సమర్ధించారు. తాజాగా ఎంపీ బండి సంజయ్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : MP Bandi Sanjay Kumar: హోంగార్డు రవీందర్ మృతికి ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత

గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం ఏ ఫైలు పంపిన ముద్ర‌వేస్తే గవర్నర్‌ను మంచిదంటారు.. లేకుంటే రాజకీయాలు ఆపాదిస్తారా అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి తప్పును తప్పు అంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరియైన పద్దతి కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా ఉండాలని కోరుకుంటోందని సంజయ్ విమర్శించారు.

Read Also : Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రేపు విచారణ

కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. నిమజ్జన విషయంలో లేనిపోని నిబంధనలుపెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దని పోలీస్ అధికారులను సంజయ్ కోరారు. అలాంటి చర్యలకు పాల్పడితే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.