Rajanna Sircilla : లక్షకు లక్ష, 3లక్షలకే 5లక్షల విలువైన బంగారం.. కట్ చేస్తే ఘరానా మోసం, వెలుగులోకి బ్లఫ్ మాస్టర్ మోసాలు

5లక్షల రూపాయల విలువైన బంగారాన్ని 3లక్షల రూపాయలకే ఇస్తానని, 8 లక్షల రూపాయల విలువైన కారు 5 లక్షలకే ఇస్తానని.. Rajanna Sircilla District

Rajanna Sircilla : లక్షకు లక్ష, 3లక్షలకే 5లక్షల విలువైన బంగారం.. కట్ చేస్తే ఘరానా మోసం, వెలుగులోకి బ్లఫ్ మాస్టర్ మోసాలు

bluff master ramesh chary

Rajanna Sircilla District : బ్లఫ్ మాస్టర్ రమేశ్ చారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రమేశ్ చారి చేతిలో మోసపోయామని బాధితులు ఒక్కక్కొరిగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మల్టీ లెవెల్ బిజినెస్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన రమేశ్ చారిని సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణలో 19 కేసుల్లో నిందితుడిగా ఉన్న రమేశ్ చారి రాష్ట్రవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. సిరిసిల్ల జిల్లాలోనే సుమారు 4 కోట్ల రూపాయల ఆన్ లైన్ బిజినెస్ చేశాడు. రమేశ్ చారి చేతిలో దగాపడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నమ్మి మోసపోయామని కన్నీటిపర్యంతం అవుతున్నారు.(Rajanna Sircilla)

Also Read..Rajanna Siricilla : బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో ఘరానా మోసం.. రూ.50 కోట్లకు కుచ్చు టోపీ

5లక్షల రూపాయల విలువైన బంగారాన్ని 3లక్షల రూపాయలకే ఇస్తానని, 8 లక్షల రూపాయల విలువైన కారు 5 లక్షల రూపాయలకే ఇస్తానని రమేశ్ చారి మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. అలాగే లక్ష రూపాయలకు లక్ష రూపాయలు ఇస్తానని మోసగించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమేశ్ చారి బాధిత సంఘం పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి న్యాయం కోసం పోరాడతాం అంటున్నారు.

Cleric Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

మల్టీ లెవెల్ బిజినెస్ పేరుతో జనాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన చీటర్ రమేశ్ చారిని సిరిసిల్ల పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతడిపై 19 కేసులు నమోదయ్యాయి. రమేశ్ చారి బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. రమేశ్ చారిపై ఫిర్యాదు చేస్తున్నారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేశారు.(Rajanna Sircilla)

8లక్షల విలువైన కారు రూ.5లక్షలకే…
”తక్కువ ధరకే నాకు కారు ఇప్పిస్తానని చెప్పాడు. 70 శాతం డబ్బులు పెడితే 30 శాతం డిస్కౌంట్ వస్తుందన్నాడు. 8లక్షల 50వేల రూపాయల విలువైన కారు 5లక్షల 20వేల రూపాయలు కడితే వస్తుందన్నాడు. దాంతో నేను డబ్బులు ఇచ్చాను. క్యాష్ రూపంలో డబ్బు ఇచ్చాను. డబ్బులు ఇచ్చిన 90 రోజుల తర్వాత మరో 30 రోజుల సమయం పడుతుందని చెప్పాడు. అలా ఏడాది పాటు కాలం గడిపాడు. కారు గురించి అడిగితే కచ్చితంగా ఇస్తాను అని చెప్పేవాడు. చివరికి మోసం చేశాడు” అని రమేశ్ చారి చేతిలో మోసపోయిన బాధితుడు తెలిపారు.

లక్షకు లక్ష ఇస్తానని మోసం..
”నన్ను చూసి మరో నలుగురు పెట్టుబడి పెట్టారు. దాదాపు 38లక్షలు ఇచ్చారు. మాకు చెక్కులు, బాండు పేపర్లు ఇచ్చాడు. ఏడాది పాటు మమ్మల్ని తిప్పాడు. అడిగిన ప్రతిసారి తప్పించుకుని తిరిగాడు. మా డబ్బులు అడిగితే మమ్మల్ని బెదిరించాడు. గత రెండు నెలలుగా మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. మాకు రూ.3లక్షలకే రూ.5లక్షల విలువైన బంగారం ఇస్తానని చెప్పి మోసం చేశాడు.

రూ.8లక్షల విలువైన కారు రూ.5లక్షలకు ఇస్తానని నమ్మించాడు. లక్షకు లక్ష రూపాయలు ఇస్తానన్నాడు. లక్షకు 30వేలు వడ్డీ ఇస్తానన్నాడు. ఇలా నమ్మించి మోసం చేశాడు. రమేశ్ చారి బాధితులు 200 మంది వరకు ఉంటారు. రమేశ్ చారి బాధితుల సంఘం పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా. రమేశ్ చారి చేసిన మోసాలను గ్రూప్ ద్వారా అందరికీ తెలిసేలా చేశా” అని రమేశ్ చారి చేతిలో మోసపోయిన మరో బాధితుడు చెప్పారు.(Rajanna Sircilla)