Sai chand: సాయిచంద్‌కు జోహార్లు అంటుంటే నా మనసు తట్టుకోలేకపోతోంది: ఆయన భార్య రజిని
సాయిచంద్ పాడిన పాటల్లో, గద్దర్ పాడిన పాటల్లో భావాలు వేరు కావచ్చని, అయినప్పటికీ ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని చెప్పారు.

Saichand, Rajini
Sai chand: గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఇక లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఆయనకు జోహార్లు అని అందరూ అంటుంటే తన మనసు తట్టుకోలేకపోతోందని ఆయన భార్య రజిని అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో గాయకులు గద్దర్, సాయిచంద్ సంస్మరణ సభ జరిగింది.
ఇందులో సాయిచంద్ సతీమణి రజిని, గద్దర్ కూతురు వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ… సాయిచంద్ తనను ఒంటరిని చేశాడని బాధపడ్డానని తెలిపారు. అయినా అభిమానుల ఆప్యాయతను తనకు అందించాడని చెప్పారు. ఆయన పాటలను అభిమానించే ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబ సభ్యులేనని అన్నారు.
సాయిచంద్ పాడిన పాటల్లో, గద్దర్ పాడిన పాటల్లో భావాలు వేరు కావచ్చని, అయినప్పటికీ ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. వారిద్దరు జీవితంలో ఎన్నో కష్టాలపడి, శ్రమతో పైకి వచ్చి ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. వారు కేవలం గాయకులు మాత్రమే కాదని, ప్రజల కోసం తపించిన వ్యక్తులని చెప్పారు. సాయిచంద్ ఆశయాలను నెరవేర్చేందుకు తాను తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.
Srisailam Cheetah : శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం.. తీవ్ర భయాందోళనలో భక్తులు