Rama Navami Shobha yatra : హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభయాత్ర సాగే రూట్ లలో 25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు.

Rama Navami Shobha yatra : హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

Rama Navami Shobha yatra

Rama Navami Shobha yatra Hyderabad : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.11 నిమిషాలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు సాగుతుంది. శోభాయాత్ర సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమై బోయగోడ కమాన్, దూల్ పేట్ మీదుగా జాలి హనుమాన్, పురానాపూల్, జుమేరిత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటీ వ్యాయామశాల వరకు శోభాయాత్ర సాగుతుంది.

Also Read : Bhadrachalam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం

శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభయాత్ర సాగే రూట్ లలో 25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, శోభాయాత్ర.. తాను చూపించిన మార్గంలోనే ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. శ్రీరామ నవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శోభయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ కోరారు.

Also Read : Bhadrachalam Seetharamula Kalyanam : సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి