Bhadrachalam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

Bhadrachalam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం

Sri Seeta Rama Kalyanam Bhadrachalam

Sri Seeta Rama Kalyanam Bhadrachalam : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మిథిలా మండపంలో సీతారాములవారి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.

Also Read : Sri Seeta Rama Kalyanam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ముస్తాబైన మిథిలా స్టేడియం

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణంను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో భక్తులు ఇబ్బందిపడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలు, 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా భద్రాచల సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

Also Read : శ్రీరామ నవమిరోజు ఏం చేయాలి..? స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యం..