శ్రీరామ నవమిరోజు ఏం చేయాలి..? స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యం..

శ్రీరామ నవమిరోజున రామునితోబాటు సీతాదేవిని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనుకూడా పూజించాలి.

శ్రీరామ నవమిరోజు ఏం చేయాలి..? స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యం..

Ram Navami 2024

Ram Navami 2024 : పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువైయ్యాడు రాముడు. మన నిత్యజీవితంలోనూ రామశబ్దం భాగమైంది. లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష.. జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ.. ఓదార్పుగా అయ్యోరామ.. అనకూడని మాటవింటే రామ రామ.. పద్దు పుస్తకాలను ప్రారంభిస్తూ శ్రీరామ.. కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా.. ఇలా ఆయన అందరి నాలుకల మీదా నర్తిస్తూనే ఉన్నాడు.. ఉంటాడు.. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పల్లె, పట్టణంలోని ప్రతీ వీధి రామ నామస్మరణంతో మార్మోగిపోతుంది. చలువ పందిళ్లు వేసి సీతారాముల వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Also Read : Sri Seeta Rama Kalyanam : భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ముస్తాబైన మిథిలా స్టేడియం

శ్రీరామ నవమిరోజున రామునితోబాటు సీతాదేవిని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనుకూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథునికూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కల్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసనకర్రలు దానం చేయడం మంచింది. అదేవిధంగా సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర పొంగలి, చెరకు, విప్పపూలు నవేదించాలి. సీతారామ కల్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని నమ్మకం.

Also Read : Bhadrachalam Seetharamula Kalyanam : సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి

భద్రాచలం నుంచి సీతారాములవారి కల్యాణమహోత్సవం ప్రత్యక్ష ప్రసారం..