రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, చంద్రబాబుసహా పలువురు ప్రముఖులు

రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుసహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, చంద్రబాబుసహా పలువురు ప్రముఖులు

Ramoji Rao Passed Away

Updated On : June 8, 2024 / 9:45 AM IST

Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈనెల 5న ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారు.

Also Read : Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

రామోజీరావు చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత రామోజీ జన్మించారు. చిన్నతనం నుంచి విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి. మీడియా, సినీ రంగంలో, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ చెరగని ముద్రవేసుకున్నారు. రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ నేతలు పురందేశ్వరి, కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావుతో వారికిఉన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.