JNTU : ఇలా అయితే తినేదెలా.. కాలేజీ క్యాంటిన్ చట్నీలో ఈదుతూ కనిపించిన ఎలుక.. వీడియో వైరల్

సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటిన్ లో ఎలుక కలకలం సృష్టించింది. విద్యార్థులకు అందించే చట్నీలో ఎలుక ఈదుతూ కనిపించింది.

JNTU : ఇలా అయితే తినేదెలా.. కాలేజీ క్యాంటిన్ చట్నీలో ఈదుతూ కనిపించిన ఎలుక.. వీడియో వైరల్

Rat running in chutney

JNTU Engineering College Hostel : సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటిన్ లో ఎలుక కలకలం సృష్టించింది. విద్యార్థులకు అందించే చట్నీలో ఎలుక ఈదుతూ కనిపించింది. దీంతో ఆ దృశ్యాలను వీడియోతీసిన కొందరు విద్యార్థులు సోషల్ మీడియా ఫోస్టు చేశారు. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేముందు క్యాంటీన్ లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. చట్నీకోసం గిన్నెలు ఓపెన్ చేశారు. అందులో చిట్టెలుక ఈదుతూ కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ చట్నీ ఎలా తినాలి అంటూ క్యాంటిన్ సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం క్యాంటిన్ నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు.

Also Read : అల్లుడిని చంపించిన అత్త.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు

హాస్టల్ మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఆహారం నాణ్యతపై విద్యార్థులు ఆందోళన చేశారు. అయినా కాంట్రాక్టర్ తీరుమార్చుకోలేదు. క్యాంటీన్ ఆవరణంలో పరిశుభ్రత పాటించక పోవటం, ఆహారం తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఎలుక చట్నీ గిన్నెలో పడిపోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ స్పందించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా క్యాంటిన్, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు తెలియజేయడంతో వారు ఆందోళన విరమించారు.

Also Read : బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన