Ration Shops : బిగ్ అలర్ట్.. తెలంగాణలో రేషన్ షాపులు బంద్..! డీలర్లు సమ్మె బాట.. ఎందుకంటే?
Ration Shops : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చేనెల 1వ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నట్లు తెలుస్తోంది.

Ration Shops
Ration Shops : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చే నెల (అక్టోబర్) 1వ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లక్డీకపూల్‌లో పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్లు ఈ సంఘం ప్రకటించినట్లు తెలిసింది.
Also Read: Aarogyasri : ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్..! రూ. 100కోట్లు విడుదల చేసినా.. వెనక్కి తగ్గని టీఏఎన్హెచ్ఏ
ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మెబాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల బకాయిలు రూ.100 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్క్షప్తులు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని, దీంతో సమ్మెబాట పట్టాల్సి వస్తుందని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు.
ప్రతినెల సొంత ఖర్చులతో బియ్యం పంపిణీ చేయాల్సి వస్తుందని, తమకు రావాల్సిన కమీషన్ రాకపోవడంతో అద్దె, కూలీలు, హమాలీ, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది ఉందని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. అదేవిధంగా తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గౌరవ వేతనంను రూ. 5వేలు, కమీషన్‌ను రూ.300 పెంచుతూ ఆదేశాలు ఇవ్వాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.